ప్రకృతి ఒక్క కసురు కసిరితే చాలు… విలయమే ఇక!

మే 20 తేదీన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని ఒక భారీ పెను తుఫాను తాకింది. ఓక్లహామా నగరం దగ్గర్లోని మూరే లో ఈ తుఫాను సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం పూట సంభవించిన ఈ రాక్షస తుఫాను దెబ్బకి 24 మంది చనిపోయారని అంట్లాంటిక్ పత్రిక తెలిపింది. గంటకు 200 మైళ్ళ వేగంతో వీచిన విధ్వంసక పెనుగాలులు కలపతో నిర్మించిన ఇళ్లను ఎత్తి కుదేసినట్లు పెకలించి వేశాయి. రెండు మైళ్ళ వెడల్పున విస్తరించిన ఒక…