పెట్రోల్ వాతలు ఈ వారంలోనే -కార్టూన్

పెట్రోల్, డీజెల్ ధరలు మళ్ళీ వార్తలకు ఎక్కుతున్నాయి. ‘ఇప్పటికయితే పెంచే ఉద్దేశ్యం ఏమీ లేదు’ అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్నాడని పత్రికలు చెప్పాయి. మళ్ళీ అదే నోటితో “అత్యవసరం అయినపుడు కఠిన నిర్ణయాలు తప్పవు. ఎంత బాధ ఉన్నా సరే” అన్నాడాయన. వచ్చే వారం పెట్రోల్, డీజెల్, కిరోసిన్, గ్యాస్ ల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని మరుసటి రోజే ‘ది పత్రిక’ తెలిపింది. ఎంతో బాధ…

నిండా మునిగిన మన్మోహన్ కి చలే లేదు -కార్టూన్

అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అప ప్రధ మూట కట్టుకున్న యు.పి.ఎ ప్రభుత్వానికి మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టడానికి సంకోచించడం లేదు. పెట్రోల్ ధరలు లీటర్ కి ఏకంగా రు. 7.54 లు పెంచడం ఆ కోవలోనిదే. ఓ పట్టాన దిగిరాని ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రజలకు ఉపశమనం చేకూర్చడానికి బదులు మరింత భారాన్ని మోపడానికే మొగ్గు చూపిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇరాన్ అణు బాంబు విషయంలో పశ్చిమ దేశాలు, ఇరాన్…

పెట్రోల్ వినియోగదారులపై చావు దెబ్బ, లీటర్ కి రు. 7.54 పై పెంపు

కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో సారి చావు దెబ్బ కొట్టింది. పెట్రోల్ ధరలు లీటర్ కి ఒకేసారి రు. 7.54 పైసలు పెంచింది. ఈ స్ధాయిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇదే మొదటి సారి. గతంలో రెండు సందర్భాల్లో లీటర్ కి రు. 5 రూపాయలు పెంచినా ఆ గీత ఎన్నడూ దాటలేదు. ఆరు నెలలు ఓపిక పట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ దెబ్బ ఒకేసారి వేసింది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటర్ కి రు.…

పెట్రోల్ ధరలు లీటరుకి రు.1.85 పై.లు తగ్గించిన ఆయిల్ కంపెనీలు

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరల్ని ఈ రోజు అర్ధ రాత్రి నుండి అంటే బుధవారం నుండీ లీటరుకు రు.1.85 పై.ల చొప్పున తగ్గించాలని నిర్ణయించాయి. అంటే 3.2 శాతం తగ్గింపన్నమాట! 18 నెలల క్రితం పెట్రోల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. పన్నులతో కలుపుకుని ఢిల్లీలో లీటర్ పెట్రో ధర రు.2.22 పై మేరకు తగ్గుతుంది. అంటే ఢీల్లీలో పెట్రోధర లీటరుకి రు.66.42 పై. కు తగ్గుతుంది. భారత…

పెట్రోల్ ధరలపై త్రిణమూల్ బెదిరింపులు ఉత్తుత్తివే

“పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం” అని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, చివరికి తన బెదిరింపులు నిజమైనవి కావని తేల్చేసింది. మంగళవారం ప్రధానితో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి లు ప్రధాని నుండి తమకు ఏ విధమైన హామీ రాలేదని చెప్పారు. “(ఇప్పుడు పెంచితే పెంచారు), ఇకముందు పెంచకూడదు” అని హెచ్చరించి వచ్చాం” అని కూడా వారు పత్రికలకు చెప్పి చక్కా పోయారు. ‘లేస్తే మనిషిని కాను’ టైపు ప్రకటనలతో ప్రజల్నీ,…

డబ్బులు చెట్లకు కాయడం లేదు, పెట్రోల్ రేట్లు పెంచాల్సిందే -ప్రధాని

ప్రధాని మన్మోహన్ మరొకసారి తాను ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకిననీ నిరూపించుకున్నాడు. తనకు కావలసిందల్లా కార్పొరేట్ల ప్రయోజనాలు వారి బాగోగులేననీ వారి ప్రయోజనాల కోసం ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదనీ తన వ్యాఖ్యల ద్వరా నిరూపించుకున్నాడు. పెట్రోల్ ధరలు ప్రభుత్వం నియంత్రించడానికి వీలు లేదనీ పెట్రోల్ ఉత్పత్తుల ధరలను మార్కెట్ లో ఉండే కంపెనీలే నిర్ణయించాలి తప్ప ప్రభుత్వం కాదనీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫ్రాన్సులో కేన్స్ నగరంలో జరుగుతున్న జి20 సమావేశాలలో పాల్గొంటున్న ప్రధాని అక్కడే ఈ ప్రకటన…

పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ

యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో…