ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!

గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో ఉత్తర కొరియా ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నానుతోంది. ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు. కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా మోసి పెడుతున్నాయి. వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి. భారత దేశంలో అయితే ప్రాంతీయ…

రైతులకు ఉరి బిగించే అభివృద్ధి -కార్టూన్

అభివృద్ధి పేరుతో భారత పాలకులు రైతుల మనుగడను ఏ స్ధాయిలో ప్రశ్నార్ధకం చేస్తున్నారో పట్టిస్తున్న కార్టూన్ ఇది! పాలకులు నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తారు గానీ ఆ అభివృద్ధి ఎవరికి చెందినదో ఎప్పుడూ చెప్పరు. అసలు 66 యేళ్ళ స్వతంత్రావనిలో అభివృద్ధి లేకుండా ఎలా పోయిందో మొదట వారు చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వారు పార్టీల మధ్య తగాదా స్ధాయికి కుదించి జనాన్ని కూడా అదే నమ్మమంటారు. పాలకవర్గ పార్టీలన్నింటి వెనుకా ఉన్నది ఒకే దోపిడీ…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…