పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…