అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

వేయి తలల హైందవ విషనాగుడి మరో వికృత శిరస్సు, ‘అస్పృశ్య గర్భం’

‘కుల వివక్ష’, వేయ పడగల హైందవ విషనాగు వికృత పుత్రిక అన్న నిజానికి సాక్ష్యాల అక్షయ పాత్రలు బోలెడు. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందో లేదో గానీ కులాల కాల కూట విషమే రక్తనాడుల్లో ప్రవహించే హైందవ విష నాగు కాట్లకు బలైన సాక్ష్యాలకు అంతూ పొంతూ లేదు. అండం తమదే, అండ విచ్ఛిత్తి చేసే వీర్యకణమూ తమదే… అయినా అండ వీర్య కణాల సంయోగ ఫలితమైన పునరుత్పత్తి కణాన్ని మోసే అద్దె…

ఫాలక్, అఫ్రీన్… నేడు షిరీన్

మనుషుల్లో మృగత్వానికి అంతే లేకుండా పోతోంది. భర్త చేత విస్మరించబడి, మరో తోడు కోసం ఆశపడి వ్యభిచార కూపంలో చిక్కిన తల్లికి తనయగా పుట్టిన ఫాలక్, పురుషాధిక్య సమాజం క్రూరత్వానికి బలై రెండేళ్ల వయసులోనే కాటికి చేరి రెండు నెలలయింది. తండ్రికి అవసరం లేని ఆడపిల్లగా పుట్టి తండ్రి చేతుల్లో చిత్ర హింస అనుభవించిన మూడు నెలల అఫ్రీన్ మరణం ఇంకా మరుపులో జారిపోనేలేదు. మరో ఫాలక్, షిరీన్ పేరుతో ఇండోర్ ఆసుపత్రిలో చేరింది. షిరీన్ వయసు…

మురికి కాలవలో అప్పుడే పుట్టిన బాలిక

ఇది రాజస్ధాన్ లో జరిగిన ఘోరం. అప్పుడే పుట్టిన బాలిక మురికి కాలవలో ప్రత్యక్షమైంది. పొద్దున్నే చేసే వ్యాయామంలో భాగంగా నడుస్తూ అటుగా వచ్చినవారు పాప ఏడుపు విని పోలీసులకు చెప్పడంతో పాప బతికిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఒక ఎన్.జి.ఓ సంస్ధ ముందుకు వచ్చి పాపని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్ధాన్ రాజధాని జైపూర్ కి 300 కి.మీ దూరంలో ఉన్న ఉదయ్ పూర్ నగరంలో జరిగిందీ ఘటన. శనివారం ఉదయం జాగింగ్…

ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతిలో చనిపోయింది

తండ్రి చేతిలో చిత్ర హింసలు అనుభవించిన మూడు నెలల పాప అఫ్రీన్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సిగరెట్ వాతలతో, గాయాలతో, రక్తం స్రవిస్తున్న మెదడుతో, విరిగిపోయిన మెడతో బెంగుళూరు ఆసుపత్రిలో చేరిన అఫ్రీన్ బుధవారం గుండే ఆగి చనిపోయింది. అబ్బాయి కోసం చూస్తే అమ్మాయి పుట్టిందనీ, అందుకే హత్యా ప్రయత్నం చేశాననీ తండ్రి ఉమర్ ఫరూక్ పోలీసుల వద్ద అంగీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. తన పాప ప్రాణాలు నిలుస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న 19 సంవత్సరాల…

ఢిల్లీ బాలిక ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

వొళ్లంతా కొరికిన గాయాలతో పాటు, చిట్లిన కపాలం, విరిగిన కాలి, చేతి ఎముకలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన రెండేళ్ల పాప ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ‘ఫాలక్’ (ఆకాశం) గా ఆసుపత్రి సిబ్బంది పేరు పెట్టిన పాపను జనవరి 18 తేదీన పద్నాలుగేళ్ల బాలిక ‘పాపకు తానే తల్లినంటూ’ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చిన సంగతి విదితమే. ముంబై టాక్సీ డ్రైవర్ రాజ్ కుమార్ అరెస్టుతో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లేనని…