సిరియాలో కాల్పుల విరమణ -ద హిందూ ఎడిట్…

  సిరియాలో కాల్పుల విరమణ విషయమై రష్యా అమెరికాల మధ్య జెనీవాలో కుదిరిన ఒప్పందం, ఐదున్నర సంవత్సరాల అంతర్యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు బహుశా అత్యంత మెరుగైన అవకాశం కావచ్చు. ఒప్పందం కింద, అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వం తిరుగుబాటుదారుల ఆధీనం లోని ప్రాంతాలపై బాంబులు వేయకుండా రష్యా నిరోధిస్తుంది. అమెరికా యేమో ఇస్లానిక్ స్టేట్ తో సహా జిహాదిస్టు  గ్రూపులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రష్యాతో చేతులు కలుపుతుంది. విశాల చట్రం ప్రాతిపదికన కుదిరిన ఈ ఒప్పందం,…

సిరియాలో ఎగదోసిన మంటలు ఫ్రాన్స్ లోకి!

ఉగ్రవాద పెనుభూతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని ఫలితంగానే ప్యారిస్ పైన టెర్రరిస్టు దాడి జరిగిపోయింది. మానవత్వం మరిచిపోయిన కిరాతక ఉగ్రవాదులు అత్యంత సుందర నగరం ప్యారిస్ పై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. 130 మందిని పొట్టన బెట్టుకున్నారు. సంగీత తరంగంలో మునిగిన వారిని, క్రీదానందంలో ఉన్నవారినీ, షాపింగ్ కు వచ్చినవారిని… వారూ వీరు అని లేకుండా అమాయకుల రక్తాన్ని చవిచూచారు. సోషలిస్టు భావ తరంగం ఊపిరి పోసుకున్న నేల ఉగ్ర మూకల పదఘట్టనలతో మైలపడిపోయింది!…

ప్రశ్న: కూలింది సోషలిస్టు రష్యాయేనా? -2

మొదటి భాగం తరువాయి…………   ఆ విధంగా సోవియట్ రష్యా ప్రజల సహాయంతో స్టాలిన్, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యానికి ఎదురైన అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ సోషలిస్టు రాజ్యం వయసు అప్పటికి ఇంకా బాల్య దశలోనే ఉంది తప్ప పరిపక్వ దశకు చేరుకోలేదు. సోషలిస్టు నిర్మాణం నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ చేయవలసిన ప్రయాణం. ఒక కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవాలంటేనే కిందిమీదులు అవుతుంటాం. అలాంటిది అనేక జాతులతోనూ, ప్రజా సమూహాలతోనూ, ప్రాంతాలతోనూ కూడి ఉండే బహుళజాతుల వ్యవస్ధను…

ఉక్రెయిన్: ప్రొ-రష్యా బలగాల పురోగమనం

అమెరికా, పశ్చిమ దేశాలు నిలిపిన ఉక్రెయిన్ హంతక ప్రభుత్వం, తిరుగుబాటు బలగాల చేతుల్లో మరోసారి ఓటమిని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ నుంచి విడిపోయి రష్యాలో కలవాలని కోరుకుంటున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు తమపై దాడికి వచ్చిన ఉక్రెయిన్ హంతక బలగాలను స్ధిరంగా తిప్పి కొడుతున్నాయి. తాజాగా డోనేట్స్క్ మిలీషియా బలగాలు పశ్చిమ అనుకూల బలగాల నుండి నోవోజోవ్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ పక్కనే ఉన్న వ్యూహాత్మక మరియుపోల్ నౌకాశ్రయ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముందుకు పురోగమిస్తున్నాయి. ఉక్రెయిన్…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…