ఎం.ఎన్.సిల డిమాండ్లు నెరవేర్చే బడ్జెట్ 2015-16 -(2)

మౌలిక నిర్మాణాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసమే అని చెబుతూ జైట్లీ బడ్జెట్ తీసుకున్న మరొక చర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేయడం. ఈ తరహా బాండ్లు జారీ చేయడం మోడి-జైట్లీ బృందం కనిపెట్టినదేమీ కాదు. ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేసి నిధులు సేకరించారు. అయితే అప్పటి ప్రభుత్వం వాటిపై పన్నులు వసూలు చేసింది. జైట్లీ బడ్జెట్ పన్నులు లేని బాండ్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఏ పేరుతో బాండ్లు జారీ చేసినా…