కాశ్మీర్ నాటకం -కార్టూన్

పరస్పర విరుద్ధ ధృవాలుగా అనదగ్గ రాజకీయ అవగాహనలు కలిగి ఉన్న బి.జె.పి, పి.డి.పి లు కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పరిచాయి. ఈ ప్రభుత్వం ఎకాఎకిన ఏర్పడిందేమీ కాదు. రెండు నెలలపాటు చర్చలు జరిపి ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ రూపొందించుకుని ఏర్పడిన ప్రభుత్వం. కనుక ఇరు పార్టీలు తమ వైరుధ్యాల కంటే ప్రజా పాలన పైనే ఎక్కువ దృష్టి పెడతారని ఆశించడం సహజం. కానీ ప్రభుత్వం ఏర్పడింది లగాయితు పాలన కంటే వైరుధ్యాల కారణంగానే పాలక పక్షాలు రెండూ…