ఆడది అలా చూడకుండా మగాడేమీ చెయ్యడు -కాంగ్రెస్ నాయకుడు

ఒకరో, ఇద్దరో నాయకులైతే నాలుగు మాటలతో విమర్శించి ఛీ, ఛీ అని ఊరుకుంటాం. ఒకసారి, రెండు సార్లు అయినా ‘సరికాదు, సవరించుకోండి’ అని చెబుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు గుంపంతా అదే బాపతైతే ఎన్ని విమర్శలు చేయాలి. ఎన్ని ఛీ, ఛీలు కొట్టాలి, ఎన్నిసార్లు సవరించుకోమని చెప్పాలి!? మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కూడా అయిన ఓ పెద్ద మనిషి మహిళలు ఆహ్వానించే విధంగా చూడకపోతే మగాళ్లు అసలు వారినేమీ ఇబ్బంది పెట్టరు…

2010 సం.లో ఇండియాలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు

పిల్లలపై అత్యాచారాలు జరపడంలో భారత దేశం పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2010 సంవత్సరంలోనే భారత దేశంలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1408 మంది పిల్లలను చంపేశారని కూడా ఆ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటా కలుపుకుని మొత్తం 10,670 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమో, ఎత్తుకెళ్లడమో చేశారని ఎన్.సి.ఆర్.బి తెలిపింది.…