హర్యానాలో మరో దాద్రి!

ఆవును చంపి తిన్నారని ఆరోపిస్తూ మతోన్మాద మూకలు దాద్రి (ఉత్తర ప్రదేశ్) లో ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని చంపిన ఘటనపై పార్లమెంటులో, దేశం అంతటా చర్చ జరుగుతుండగానే బి.జె.పి పాలిత హర్యానా రాష్ట్రంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాధితులకు ప్రాణాలు దక్కడం ఒక్కటే తేడా. హర్యానా రాష్ట్రం, పాల్వాల్ లో గురువారం జరిగిన ఘటనలో ఆవు మాంసం తరలిస్తున్నారన్న ఆరోపణతో ఒక వ్యాన్ డ్రైవర్, సహాయకుడిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు.…