జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో  పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…

భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్

“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్”  పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…

వెస్ట్ బ్యాంక్ లో కొత్త సెటిల్మెంట్ నిర్మాణానికి ఇజ్రాయెల్ ఆమోదం

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగం “వెస్ట్ బ్యాంక్” లో మరో కొత్త సెటిల్మెంటు నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ శనివారం ఈ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో జరిగే ఎటువంటి శాంతి ఒప్పందంలో నైనా తన ఆధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్న భూభాగం పైనే కొత్త సెటిల్మెంట్ నిర్మానం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు ఖండించారు. “ఈ నిర్ణయం…

సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు

  పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం…