“వెయ్యి మందికి ఒకరు, ఒకరికి వెయ్యి మంది” -కార్టూన్

మూడు రోజుల క్రితం పాలస్తీనా పోరాట సంస్ధ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తమ బందీగా ఉన్న ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు (గిలాద్ షాలిత్) ను వదిలిపెట్టగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి విచారణ లేకుండా తాను ఖైదు చేసి ఉంచిన 1027 మంది పాలస్తీనీయులను విడుదల చేయవలసి వచ్చింది. ఈ మార్పిడి కోసం గత ఐదు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు మార్పిడి జరగదని కూడా అనుకున్నా, ఇజ్రాయెల్…

ఒక ఇజ్రాయెల్ సైనికుడి కోసం 1027 పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక ఖైదీల మార్పిడి ఒప్పందం మంగళవారం అమలవుతోంది. పాలస్తీనీయులు పట్టుకున్న ఒకే ఒక్క ఇజ్రయెల్ సైనికుడుని విడుదుల చేస్తున్నందుకుగానూ ఇజ్రాయెల్ అనేక సంవత్సరాల తరబడి తమ జైళ్లలో ఉంటున్న పాలస్తీనా జాతీయులను విడుదల చేయడానికి సిద్దపడింది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు చివరికి ఫలవంతం అయ్యాయి. మంగళవారం 477 మంది, మరో రెండు నెలల్లో మరో 550 మంది పాలస్తీనా ఖైదీలు…