పార్లమెంటులో ఆంధ్ర ప్రదేశ్ -కార్టూన్

మేధావి: ఫిషనా లేక ఫ్యూషనా? సామాన్యుడు: ఏదీ కాదు పెప్పర్ స్ప్రే *** భారత దేశానికి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం.  సభలో కూర్చునేవారు ఈ సంగతి చెబుతారు. సభ బయట ఉన్న మనం అది నిజమే కాబోలని నమ్ముతున్నాం. ప్రజాస్వామ్య దేవాలయం ప్రాశస్త్యం గురించి అనేక పుస్తకాలు, పాఠ్య గ్రంధాలు, పరిశోధనా పత్రాలు చెప్పే సూత్రాలకు ఇక కొదవే లేదు. కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం ఇందుకు విరుద్ధం. పార్లమెంటులో సజావుగా చర్చలు జరిగిన సందర్భాలు చాలా…

రూపాయి-పార్లమెంటు: పతనం దేనిది? -కార్టూన్

నాయకుడు: అది పార్లమెంటే! సామాన్యుడు: కాదది రూపాయే! ఒక పక్క రూపాయి విలువ పతనం అవుతుండగా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను చర్చించి సవరించవలసిన చట్ట సభల సభ్యులు మాత్రం సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రకరకాల సర్కస్ ఫీట్లు సాగిస్తున్నారు. ‘ఆహార భద్రతా బిల్లు,’ ‘ఇన్సూరెన్స్ ఎఫ్.డి.ఐ బిల్లు,’ తదితర ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందడానికి పాలక పక్షం చిత్రవిచిత్రమైన ఎత్తుగడలు వేస్తుండగా, పాలక పక్షం పరువు తీసి వీలైనన్ని ఓట్ల మార్కులు తమ ఖాతాలో…