అద్వానీ ఆవిరై న.మోగా ఘనీభవనం
హాలీవుడ్ యాక్షన్ ధ్రిల్లర్ ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమాలో హీరో, విలన్ ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇప్పుడంటే అలాంటి గ్రాఫిక్ సీన్లు మామూలయ్యాయి గాని రెండు దశాబ్దాల క్రితం ఆ తరహా గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని నిజంగానే భవిష్యత్తుకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా ఆ విలన్ ఏ పాత్రలోకయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. రంధ్రాల గుండా, సందుల గుండా ఎక్కడికంటే అక్కడికి పాదరసంలా జారిపోతూ కావలసిన రూపంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాడు. ఇప్పుడు బి.జె.పిలో…