సింగూరు తీర్పు: వ్యవసాయమా, పరిశ్రమలా? -2

రైతులు కలకత్తా హై కోర్టుకు వెళ్ళినప్పటికి టాటా కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగించింది. జనవరి 18, 2008 తేదీన తీర్పు ప్రకటిస్తూ కలకత్తా హై కోర్టు టాటా కంపెనీకి వత్తాసు వచ్చింది. సింగూరు భూముల స్వాధీనం చట్టబద్ధమే అని ప్రకటించింది. దానితో రైతులు, వారి తరపున కొన్ని ఎన్‌జి‌ఓ సంస్థలు హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ మరోసారి కారు ఫ్యాక్టరీ ముందు నిరవధిక ధర్నాకు దిగడంతో…

కొత్తశాఖలో జైరాం రమేష్ మార్కు విధానాలు ప్రారంభం, గ్రామీణాభివృద్ధికి 90,000 కోట్లు

పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఇతర మంత్రుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న జైరాం రమేష్ తనకు అప్పజెప్పిన గ్రామిణాభివృద్ధి శాఖలో కూడ తన మార్కు విధానాలను ప్రారంభించాడు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పధకాలన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తిగా నిర్వహణ రాష్ట్రాలకే అప్పజెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్ణయించగా, దానికి జైరాం రమేష్ పక్కకు నెట్టి కేంద్ర…