సుప్రీం కోర్టు రాజ్యాంగవిరుద్ధ తీర్పు ప్రతిఘటిస్తాం -పాక్ మాజీ ప్రధాని

పాకిస్ధాన్ లో పాలకవర్గాల ఘర్షణ ముదురుతోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే దానిని ప్రతిఘటిస్తామని మాజీ ప్రధాని గిలానీ ప్రకటించాడు. కోర్టు తీర్పును తిరస్కరించి సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్తామని కోర్టుకు నేరుగా హెచ్చరిక జారీ చేశాడు. కొత్త ప్రధాని అష్రాఫ్ ను ప్రధానిగా తొలగించినట్లయితే ప్రజలు ఆందోళన చేస్తారని హెచ్చరించాడు. ఆగస్టు 27 న తనముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాని ‘రాజా పర్వేజ్ అష్రాఫ్’ ను కొద్ది రోజుల…

కోర్టు ధిక్కారం: కొత్త ప్రధానినీ వదలని పాక్ సుప్రీం కోర్టు

పాకిస్ధాన్ దేశ అత్యున్నత రాజ్యాంగ నాయకుడిపై అక్కడి సుప్రీం కోర్టు రెండో సారి ‘కోర్టు ధిక్కారం’ కేసు కింద విచారణ జరపడానికి ఉద్యుక్తం అవుతోంది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడన్న నేర నిర్ధారణ చేసి మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ని పదవీ భ్రష్టుడిని చేసిన పాక్ సుప్రీం కోర్టు, సరిగ్గా అవే కారణాలతో ఆ తర్వాతి ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై కూడా చర్యలు మొదలు పెట్టింది. పాకిస్ధాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ…

గిలానీ ప్రధాని పదవికి అనర్హుడు, పాక్ సుప్రీం కోర్టు సంచల తీర్పు

పాకిస్ధాన్ మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య ఆధికారాల కోసం జరుగుతున్న ఘర్షణలో తాజా అంకానికి తెర లేచింది. ప్రధాని కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితం సుప్రీం తీర్పు చెప్పిన నేపధ్యంలో ప్రధాన మంత్రి గిలానీ పార్లమెంటు సభ్యత్వం రద్దయినట్లేననీ, కనుక గిలానీ పదవి నుండి దిగిపోవాల్సిందేనని సంచల రీతిలో తీర్పు ప్రకటించింది. ప్రధానిని పదవి నుండి తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందనీ, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనలను…

పాకిస్ధాన్ ‘మెమో గేట్’ పాక్ ఆర్మీ కుట్రా?

పాకిస్ధాన్ రాజకీయ రంగాన్ని ఇప్పుడు మెమో గేట్ కుంభకోణం ఊపేస్తోంది. ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం పాకిస్ధాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆరోపిస్తూ, అది జరగకుండా చూడాలని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు సంతకం లేని మెమో పంపినట్లుగా వార్త వెలువడింది. ఇది “మెమో గేట్” గా పత్రికలలో వ్యాప్తి చెందింది. పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ ఆ…