ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన

అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ…