పాక్ చెక్‌పోస్టు దాడిపై అమెరికా నివేదికను తిరస్కరించిన పాక్ సైన్యం

నవంబరు చివరి వారంలో ఆఫ్-పాక్ సరిహద్దులో గల పాకిస్ధాన్ చెక్ పోస్టులపై అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది పాక్ సైనికులు చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఉన్నత స్ధాయిలో దర్యాప్తు జరుపుతామని అమెరికా, నాటోలు హామీ ఇచ్చాయి. సదరు దర్యాప్తు నివేదికను అమెరికా పూర్తి చేసింది. ఈ నివేదికను పాకిస్ధాన్ సైన్యం తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. పాక్, అమెరికాలు ఇరువైపులా జరిగిన తప్పుల వలన పాక్ సైనికుల పెద్ద సంఖ్యలో…

పాక్ వైమానిక స్ధావరాన్ని ఖాళీ చేసిన అమెరికా

పాకిస్ధాన్ హెచ్చరికతో అక్కడ ఉన్న వైమానిక స్ధావరాన్ని అమెరికా బలగాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కొద్ది రోజుల తర్వాత పాక్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందని భావించినవారి ఊహలు, ఊహలుగానే మిగిలాయి. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి పాకిస్ధాన్ సైన్యం, పౌర ప్రభుత్వం ఔదలదాల్చాయి. ఆదివారం షంషి వైమానిక స్ధావరాన్ని పాకిస్ధానీ ఆర్మీ అమెరికా బలగాలనుండి స్వాధీనం చేసుకుంది. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో రెండు చెక్ పోస్టుల వద్ద ఉన్న పాక్ సైనికులను ఇరవై నాలుగు మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్…

పాక్ చెక్ పోస్టులపై దాడి మిలట్రీ ఆపరేషన్ లో భాగమే -అమెరికా

ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం…

హెచ్చరిక లేకుండా దాడి చేస్తే అనుమతి కోసం చూడకుండా బదులివ్వండి -పాక్ ఆర్మీ ఛీఫ్

హెచ్చరికలు లేకుండా పై దాడి జరిగితే పాకిస్ధాన్ సైనికులు తిరిగి దాడి చేయడానికి ఇక తమ పై అధికారుల అనుమతి తీసుకోనవసరం లేదని పాకిస్ధాన్ మిలట్రీ ఛీఫ్ జనరల్ అష్ఫక్ కయానీ పాకిస్ధాన్ కమేండర్లకు చెప్పాడు. పాకిస్ధాన్ చెక్ పోస్టులపై దాడి చేసి అమెరికా కమెండోలు పాక్ సైనికులను చంపడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. “ఏ ఒక్క పాకిస్ధాన్ కమాండర్ మదిలో కూడా ఈ విషయంలో, ఏ స్ధాయిలోనైనా సరే, ఎటువంటి అనుమానం ఉంచుకోరాదు. తిరిగి…

పాకిస్ధాన్ ప్రతినిధులు ఓ.కె అన్నాకే అమెరికా దాడి చేసింది -వాల్‌స్ట్రీట్ జర్నల్

ఇరవై నాలుగు మంది పాకిస్ధానీ సైనికులు చనిపోవడానికి కారణమైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్ల దాడిని ‘ఉమ్మడి కమాండ్ సెంటర్’ లోని పాకిస్ధాన్ ప్రతినిధులు ఆమోదించిన తర్వాతే చేశామని అమెరికా కమేండర్లు చెప్పినట్లుగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తెలిపింది. కమాండ్ సెంటర్ లో ఉన్న పాకిస్ధాని ప్రతినిధులకు దాడి జరిగే చోట పాకిస్ధాన్ తాత్కాలిక పోస్టు నెలకొల్పిందని తెలియకపోవడంతో వారు దాడికి పచ్చ జెండా ఊపారని అమెరికా కమేండోలు తెలిపారు. అయితే కాల్పులు ప్రారంభం అయ్యాక…

మా చెక్‌పోస్టులపై దాడి చేస్తున్నామని అమెరికాకి ముందే తెలుసు -పాక్ మిలట్రీ

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్ధాన్ చెక్ పోస్టులపైనే తాము దాడి చేస్తున్నామన్న సంగతి అమెరికా హెలికాప్టర్లకూ, జెట్ ఫైటర్లకూ ముందే తెలుసనీ, తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారనీ పాకిస్ధాన్ మిలట్రీ వ్యాఖ్యానించింది. పాకిస్ధాన్ మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ ఈ మేరకు పత్రికలకు వివరాలు వెల్లడించాడు. అమెరికా హెలికాప్టర్లు పాకిస్ధానీ చెక్ పోస్టులపై దాడి చేస్తున్నారని అమెరికా బలగాలను అప్రమత్తం చేసినప్పటికీ కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపాడు. పత్రికా…

పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దు వద్ద రెండు చెక్ పోస్టుల వద్ద మొహరించి ఉన్న పాక్ సైనికులను 28 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు చంపినందుకు నిరసనగా జర్మనీ లోని బాన్ నగరంలో జరగనున్న ఆఫ్ఘనిస్ధాన్ కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదని పాకిస్ధాన్ నిర్ణయించింది. కాన్ఫరెన్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించి కీలక పాత్ర పొషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరీ లో ఆఫ్ఘనిస్ధాన్ పై కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్ధాన్ సహాయం లేనట్లయితే ఆఫ్ఘనిస్ధాన్…

అమెరికా కండకావరం: కాల్పులు ఆపమని విజ్ఞప్తి చేసినా పట్టించుకోని వైనం

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికాకి సహకరిస్తున్నందుకు పాకిస్ధాన్ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సంవత్సరం క్రితం అమెరికా హలికాప్టర్ల కాల్పుల్లో ఇద్దరు సైనికులను నష్టపోయిన పాకిస్ధాన్, గత శనివారం అమెరికా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ విమానాలు జరిపిన దాడిలో చెక్ పోస్టు వద్ద కాపలా ఉన్న 28 మంది సైనికులను (24 మంది అని ‘ది హిందూ‘, ‘ఫస్ట్ పోస్ట్‘ పత్రికలూ, 25 మంది అని ‘ది గార్డియన్‘ పత్రికా చెబుతున్నాయి) కోల్పోయిన సంగతి విదితమే. అమెరికా హెలికాప్టర్లు,…

అబద్ధాలతో ‘పాక్ సైనికుల హత్యల’ను కప్పిపుచ్చుకుంటున్న అమెరికా

పాకిస్ధాన్ లో చెక్ పోస్టు వద్ద ఉన్న పాక్ సైనికులను 24 మందిని (28 మందని ‘ది టెలిగ్రాఫ్ చెబుతోంది) చంపి, మరో 13 మందిన గాయపరిచిన అమెరికా, తన దాడులను సమర్ధించుకోవడానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అమెరికా చెబుతున్న అబద్ధాలను నిజాలుగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. గోబెల్ ను ఎప్పుడో తలదన్నిని ఈ పడమటి పత్రికలు ఆర్ధికంగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా అమెరికా, యూరప్…

అమెరికాపై ప్రతీకార చర్యలు తీవ్రం చేసిన పాక్, అమెరికా సారీ

పాకిస్ధాన్ గగన తలం లోకి మరోసారి జొరబడడమే కాకుండా, తాలిబాన్ పై పోరాడుతున్న 28 మంది పాక్ సైనికుల్ని అమెరికా హెలికాప్టర్లు చంపేయడంపైన పాకిస్ధాన్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీలు ప్రతీకార చర్యలను ముమ్మరం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో పాక్ ఇస్తూ వచ్చిన సహకారం తగ్గించే వైపుగా పాక్ మిలట్రీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాక్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు…

అమెరికాపై పాకిస్ధాన్ ప్రతీకారం, అమెరికా సైనికులకు ఆహార, ఆయుధ సరఫరాలు బంద్

ఆఫ్ఘనిస్ధాన్ తో గల సరిహద్దుకు సమీపాన చెక్ పాయింట్ వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులు 28 మందిని అమెరికా హెలికాప్టర్ దాడి చేసి చంపడానికి వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు ఆయుధాలు, ఆహారం తన భూభాగం ద్వారా సరఫరా కాకుండా అడ్డుకుంది. అంతమంది సైనికులు తమ దాడిలో చనిపోయినప్పటికీ అమెరికా సైన్యం నుండి ఇంతవరకు సరైన ప్రకటన రాలేదు. “ఎవరైనా చనిపోతే వారికి మా సానుభూతి” అని…