కాల్పుల విరమణను కాపాడండి! -ది హిందు ఎడిట్

(ఇండియా-పాకిస్ధాన్ ల మధ్య సరిహద్దుల ఆవలి నుండి కాల్పులు జరగడం మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ కాల్పుల్లో సోమవారం 5గురు భారతీయ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా కాల్పుల్లో తమ పౌరులూ మరణించారని, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత సైనికులు కాల్పులు జరుపుతున్నాయని పాకిస్ధాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఆధీన రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చెదురు…

గదిలో ఏనుగు, పాక్ మిలట్రీ -కార్టూన్

పాకిస్ధాన్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం (ప్రజల ప్రజాస్వామ్యం కాదు) కూడా ఓ ఎండమావిగా మారిపోయింది. ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడి అది కుదురుకునే లోపుగా అక్కడి మిలట్రీ జోక్యం చేసుకోవడం, ఎన్నికయిన ప్రభుత్వాల్ని కూల్చివేయడం ఒక పరిపాటి అయింది. పాలక వర్గాల మధ్య కుమ్ములాటలే ఈ ప్రహసనానికి మూల కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ నవాజ్ షరీఫ్ కీ, అక్కడి మిలట్రీకి…

పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది.…

పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?

సూఫీ గురువు తాహిర్-ఉల్-ఖాద్రి కెనడా నుండి పాకిస్థాన్ లోకి తిరిగి ప్రవేశించినప్పటినుండీ అక్కడ అధికార కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలనీ, మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనీ ఖాద్రి ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చిందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది .…

పాక్ సాయంలో భారీ కోతకు ఆమోదించిన అమెరికా కాంగ్రెస్

పాకిస్ధాన్ కి ఇస్తున్న సాయంలో భారీ కోత విధించడానికి అమెరికా సిద్ధపడుతునంట్లు కనిపిస్తోంది. 650 మిలియన్ డాలర్ల కోత విధించే బిల్లును అమెరికా కాంగ్రెస్ శుక్రవారం ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ కి మెజారిటీ సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో సీనియర్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ‘టెడ్ పో’ ప్రవేశ పెట్టిన బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. పాకిస్ధాన్ ను అమెరికా విప్లవంలో విద్రోహిగా ముద్ర పడిన “బెనెడిక్ట్ ఆర్నాల్డ్” గా ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడొకరు…

ఆరోజుతో నాజీవితం ముగిసినట్టే -కొడుకు తప్పుకు నగ్నంగా ఊరేగించబడ్డ పాక్ స్త్రీ వ్యధాభరిత కధనం

జూన్ నెలారంభంలో పాకిస్ధాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ ఖ్వా రాష్ట్రంలోని నీలోర్ బాలా గ్రామంలో ఓ మధ్య వయసు స్త్రీని అతని కొడుకు చేసిన తప్పుకు బలవంతంగా వివస్త్రను కావించి ఊరేగించారు. ఈ ఘటన పాకిస్ధాన్‌లో సంచలనం కలిగించింది. ఆ రోజు ఏం జరిగిందీ తెలుసుకోవడానికి బిబిసి విలేఖరి అలీమ్ మక్బూల్ పాకిస్ధాన్‌ ఉత్తర ప్రాంతానికి వెళ్ళాడు. ఘటన జరిగిన నాటినుండి తన గ్రామంలో నివసించడానికి ఇష్టపడని ఆమె నివసిస్తున్న ప్రాంతాన్ని మక్బూల్ కనుగొని ఆమె ద్వారా ఆ…