మంగళయానం: చైనా ప్రశంసల జల్లు

అంగారక ప్రయాణాన్ని విజయవంతం చేసినందుకు ఇండియాపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. రష్యా కూడా ఇండియాను అభినందించింది. మంగళయానం విజయవంతం కావడం ఒక్క ఇండియాకు మాత్రమే గర్వకారణం కాదని ఆసియా ఖండానికి అంతటికీ గర్వకారణం అనీ చైనా ప్రశంసించడం విశేషం. మంగళయానం విజయం ద్వారా ఇండియా, చైనాకు అంతరిక్ష యానాంలో గట్టి పోటీదారుగా అవతరించిందని భారత పత్రికలు వ్యాఖ్యానించాయి. అయితే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ఇండియా విజయం తన ఆసియా సహోదరుడి విజయం కనుక…

ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు

ఉత్తర కొరియా గురించి విషం చిమ్మని పశ్చిమ పత్రిక అంటూ కనపడదు. అక్కడికి విదేశీ విలేఖరులను రానివ్వరని, ఉక్కు తెరల మధ్య ప్రజలు అష్టకష్టాలు పడతారని, రోడ్డు మీద అసలు జనమే కనిపించరనీ… ఇలా రాస్తుంటాయి. ఈ ప్రచారం నిజం కాదని చెప్పడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రత్యేకంగా విలేఖరులను ఆహ్వానించి టూర్లకు తిప్పుతుంది. ఈ టూర్లకు వెళ్ళినవాళ్లు ఫోటోలు తీసుకుని కూడా తమ కోసం ప్రత్యేకంగా జనాన్ని ఏర్పాటు చేశారని పశ్చిమ విలేఖరులు రాయడం కద్దు.…