విరుద్ధ దృష్టితో ఒకే తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జిలు -1

పశ్చిమ బెంగాల్ లో పాతికేళ్ళ అవిచ్ఛిన్న లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు చరమగీతం పలికేందుకు దారి తీసిన సింగూరు భూములను బలవంతంగా లాక్కున కేసులో నిన్న (ఆగస్టు 31) సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. నానో కారు తయారీ కోసం టాటా మోటార్ కంపెనీకి అప్పగించడానికి వామపక్ష ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం సింగూరు రైతుల నుండి గుంజుకున్న వ్యవసాయ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్ లో బలం…

4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు -కార్టూన్

అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్న ఈ కార్టూన్, మన ముందు పరిచిన తమాషాను చెప్పుకుని తీరాలి. ఎడమ-పైన నుండి గడియారం ముల్లు తిరుగు దిశలో… 1. అస్సాం: బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షాకు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి తల బొప్పి కట్టింది. బీహార్ ఎన్నికల్లో లాలూ, నితీష్ లు ఉమ్మడిగా కొట్టిన దెబ్బకు ఆ బొప్పి మరింత వాచిపోయింది. అస్సాం ఎన్నికల్లో వాచిపోయిన బొప్పి కాస్త ఒంటి కొమ్ము…

టి.ఎం.సి బలహీనతలే బి.జె.పికి బలమా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ లో ఒక దశలో ఎదురు లేనట్లు కనిపించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస ఇక్కట్లు ఎదుర్కొంటోంది. శారద చిట్ ఫండ్ కుంభకోణం మమత బెనర్జీ మెడకు భారీ గుదిబండగా మారిపోయింది. బర్ద్వాన్ పేలుళ్లు చేయించింది టి.ఎం.సి పార్టీయే అన్నట్లుగా బి.జె.పి అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ డబ్బు బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించారని,  శారదా చిట్ ఫండ్ కుంభకోణం దోషులను టి.ఎం.సి కాపాడుతోందని ఒక ర్యాలీలో మాట్లాడుతూ బి.జె.పి అమిత్…

మమత చిక్కరు, దొరకరు -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని తమ కూటమిలో చేర్చుకోడానికి యు.పి.ఎ, ఎన్.డి.ఎ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ యు.పి.ఎ నుండి బైటికి దూకిన తర్వాత త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎవరికీ ‘చిక్కరు, దొరకరు’ అన్నట్లుగా పరిస్ధితి ఉంటోంది. ఆమెకు  అనుకూలంగా వ్యవహరించడానికి రెండు కూటముల నాయకులు ప్రయత్నిస్తున్నా, ఆమె ఎవరివైపు మొగ్గు చూపుతారో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక రోజు యు.పి.ఎ పైన యుద్ధం ప్రకటించినట్లు మాట్లాడి ఒక సంకేతం ఇచ్చినట్లు…