మైలు రాయి: ఇరాన్, ఇరాక్ మధ్య మిలట్రీ ఒప్పందం!

పశ్చిమాసియాలో మరో ముఖ్య సంఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మసలిన ఇరాన్, ఇరాక్ లు కీలకమైన మిలట్రీ ఒప్పందం చేసుకున్నాయి. ‘ఉగ్రవాదం మరియు తీవ్రవాదం’ లకు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగా తాము ఈ ఒప్పందం చేసుకున్నామని ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ మేరకు ఇరాన్ రక్షణ మంత్రి హోస్సేన్ దేఘన్, ఇరాక్ రక్షణ మంత్రి ఇర్ఫాన్ ఆల్-హియాలి లు అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం… ఈ పదాలు దేశాల ప్రభుత్వాలకు…

నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?

  టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు. నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…