ఐరోపా మంచు తుఫాను: పైన్ చెట్లా? హిమ శిల్పాలా? -ఫోటోలు

ప్రాకృతిక వింతలను రికార్డు చేయడం మొదలు పెట్టాలే గానీ దానికిక అంతూ పొంతూ అంటూ ఉండదు. అదొక మహా యజ్ఞం అనడం సబబుగా ఉంటుంది. కాదంటే రెండు రోజుల పాటు కురిసిన మంచు తుఫాను తూర్పు యూరప్ దేశాలలోని ఆల్ప్స్ పర్వత శ్రేణిపై విస్తరించిన అటవీ వృక్షాలను, ఇతర నిర్మాణాలను హిమనీ శిల్పాలుగా మార్చివేయడం గురించి ఎలా చెప్పగలం? ఐరోపాలోని పలు దేశాలను తీవ్ర వాతావరణ పరిస్ధితులు చుట్టు ముట్టాయి. ఎముకలు కొరికేసే చలి వాతావరణం జనజీవనాన్ని…