ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్…

ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

రేడియేషన్ (అణు ధార్మికత) ఎంత తక్కువయితే సేఫ్?

జపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకర ప్రమాదం జరిగాక తరచుగా వినిపిస్తున్న మాట “రేడియేషన్ ఫలానా పరిమితి కంటే తక్కువగా ఉంది గనక ప్రమాదం లేదు” అని. అణు పరిశ్రమ యాజమాన్యాలు, వారికి వత్తాసుగా నిలిచే “voodoo” శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తరచుగా ఈ పదజాలాన్ని వల్లె వేస్తున్నారు. వాతావరణంలో సహజంగానే కొంత రేడియేషన్ ఉంటుందనీ, అసలు మానవ శరీరంలోనే కొంత రేడియేషన్ ఉంటుందనీ, కనుక ఫలానా పరిమాణం కంటే తక్కువ స్ధాయిలో రేడియేషన్ సోకినా ప్రమాదం…

కాలిఫోర్నియా చేపల్లో ఫుకుషిమా రేడియేషన్

కాలిఫోర్నియా సముద్ర తీరంలో పట్టిన ‘బ్లూఫిన్ తునా’ చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ సముద్ర జలాల్లో ఈదుతుండగా ఫుకుషిమా రేడియేషన్ కాలుష్యాన్ని గ్రహించిన తునా చేపలు అనంతరం కాలిఫోర్నియా తీరానికి వచ్చి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చేపల్లోని కాలుష్యం ప్రమాదకరం కాదనీ, అయితే వలస వెళ్ళే సముద్ర జీవుల ద్వారా కాలుష్యం ఎంతటి దూరానికైనా చేరవచ్చన్నదీ తమ పరిశోధన చెబుతోందని వారు తెలిపారు. మార్చి 11, 2011 తేదీన జపాన్ లో పెద్ద…

లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్

జపాన్ లో మార్చి 11 తేదీన ఫుకుషిమా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల మూడు రియాక్టార్లలో ‘మెల్ట్ డౌన్’ జరిగి ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా, మరొక రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. దీనివల్ల రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించింది. రేడియేషన్ వల్ల కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర నీరు కూడా కలుషితం అయింది. గాలిలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధాలు, ముఖ్యంగా అయోడిన్,…

రెండో భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

భూకంపం, ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్ వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది.…

మొదటి భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

గత సంవత్సరం మార్చి 11 తారీఖున జపాన్ లో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.9 గా దాని తీవ్రత నమోదయింది. దీనివల్ల అతి పెద్ద సునామీ సంభవించింది. భూకంపం వచ్చిన 47 నిమిషాల తర్వాత సునామీ అలలు జపాన్ తూర్పు తీరాన్ని తాకాయి. 20 మీటర్ల ఎత్తున అలలు విరుచుకు పడ్డాయని పత్రికల ద్వారా తెలిసింది. భూకంపం, సునామీల వలన జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉన్న ఫుకుషిమా అణు…

కాలిఫోర్నియా సముద్ర మొక్కల్లో ఫుకుషిమా రేడియేషన్

అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో జపాన్ ఫుకుషిమా అణు ప్రమాదానికి చెందిన రేడియేషన్ చేరుకుందని వెల్లడయింది. ఫుకుషిమా దై-చి అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన నెల రోజులకే రేడియేషన్ అమెరికా తీరానికి వచ్చిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీనితో అనేక సంస్ధలు, పర్యావరణ ఉద్యమవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనని తేలింది. ఫుకుషిమా ప్రమాదం అనంతరం, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సి.ఎస్.యు), లాంగ్ బీచ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఆరంజ్ కౌంటీ, శాంతా క్రాజ్…

ఇండోనేషియాలో 8.7 భూకంపం, సునామీ హెచ్చరిక

ఇండోనేషియా Aceh ప్రాంతానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 గా నమోదయిన ఈ భాకంపం ప్రపంచంలో ఇప్పటివరకూ సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా చానెళ్లు పేర్కొంటున్నాయి. హిందూ మహా సముద్ర వ్యాపితంగా సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్ద తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా ఏ వార్తా సంస్ధ ప్రకటించలేదు. ‘ఎర్త్ క్వేక్ రిపోర్ట్’ వెబ్ సైట్ అందించిన శాటిలైట్ పటాన్ని కింది చిత్రంలో చూడవచ్చు. మొదట భూకంప…

అంతిమ ఘడియల్లో ‘పిచ్చుకలు -ఫొటోలు

పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు…

‘భోపాల్ గ్యాస్ లీక్’ ఉద్యమం పై నిఘా పెట్టిన ‘డౌ కెమికల్స్’

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు నష్ట పరిహారం కోసం పోరాడుతున్న సంస్ధలపైన అమెరికా కంపెనీ ‘డౌ కెమికల్స్’ అనేక సంవత్సరాలుగా నిఘా పెట్టిన సంగతి వెల్లడయ్యింది. అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ‘స్ట్రాట్ ఫర్’ అనే ప్రవేటు డిటెక్టివ్ కంపెనీని ఇందుకు వినియోగించినట్లుగా వెల్లడ్యింది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ ‘స్ట్రాట్ ఫర్’ కి సంబంధించిన 5.5 మిలియన్ల (55 లక్షలు) ఈ మెయిళ్ళు వికీ లీక్స్ కు అందడంతో స్ట్రాస్ ఫర్ పాల్పడిన పాపాల పుట్ట బద్దలయింది.…

‘వేడి వేసవులే’ ‘తీవ్ర శీతలాలకి’ కారణం

ఉత్తరార్ధ గోళంలో వేడి వేసవి కాలాలు అమెరికా, యూరప్ లలో తీవ్ర చలితో కూడిన శీతాకాలాలకు కారణం అవుతున్నాయని అమెరికా అధ్యయన సంస్ధ ఒకటి తెలిపింది. ‘ఎన్విరాన్‌మెంటల్ రీసర్చ్ లెటర్స్’ అనే పత్రికలో శుక్రవారం  ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. మంచు తుఫాన్లు, శీతాకాలంలో తీవ్రమైన చలితో కూడిన టెంపరేచర్లు గత రెండు సంవత్సరాలలో అమెరికా, యూరప్ లలోని కొన్ని ప్రాంతాల్లో అనేక సమస్యలను సృష్టించాయి. భూమి వేడెక్కుతోందని ఓ పక్క శాస్త్రవేత్తలు గోలపెడుతుండగా ఎదురుగా ఎవరున్నదీ…

పెద్ద దొంగను పట్టిస్తే జరిగేదేమిటి? -కార్టూన్

సౌదీ అరేబియాలో, అది కూడా రాజధాని రియాధ్ లోనే దరిద్రం ఎలా తాండవిస్తున్నదీ తెలియజెస్తూ ఫెరాస్ బగ్నా అనే యువకుడు ఒక చిన్న వీడియో తీసి దానిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ధనవంతులు తమకు తోచిన మొత్తాన్ని దానం చేసి దరిద్రులకు అండగా నిలుస్తారని అతను భావించాడు. కాని అతనికి తెలియని మరొక విషయం కూడా వీడియో ద్వారా వెల్లడయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న సౌదీ అరేబియా ప్రజలు, అందునా…