జి.డి.పిలు, కరెన్సీ విలువల తేడాలు -ఈనాడు

ఈ రోజు ఈనాడు పత్రికలో వివిధ జి.డి.పిల గురించి, కరెన్సీల మధ్య తేడాల గురించి చర్చించాను. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ లెక్కన ఇండియా జి.డి.పి మూడో స్ధానంలో ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఐ.ఎం.ఎఫ్ ప్రకటించింది. ఈ అంచనాను మన పత్రికలు సగర్వంగా రాసుకుని గర్వించాయి. దీన్ని చదివిన కొందరు మేధావులు మనకు తెలియకుండానే మనం అగ్రరాజ్యం స్ధానానికి చేరిపోతున్నామన్న భ్రమలో పడిపోయారు. వాస్తవానికి అసలు జి.డి.పియే దేశ ఆర్ధిక స్ధితిగతులను సరిగ్గా ప్రతిబింబించదు. పి.పి.పి జి.డి.పి…