డీఎంకే సహకారంతో పళనిస్వామి విశ్వాస తీర్మానం గెలుపు

శశికళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఈపిఎస్ (E పళనిస్వామి) విశ్వాస తీర్మానం నెగ్గాడు. ‘న్యాయం గెలుస్తుంది. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అంటూ బింకం ప్రదర్శించిన ఓపిఎస్ చివరికి బిక్క మొహం వేశాడు. ఈపిఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా 122 మంది ఎంఎల్ఏ లు ఓటు వేయగా వ్యతిరేకంగా కేవలం 11 మంది ఎంఎల్ఏలు మాత్రమే ఓటు వేశారు. జయలలిత ఓటు లేదు కనుక ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎంఎల్ఏలు మద్దతు చాలు.      …

శశికళ స్ట్రోక్: పన్నీర్ బహిష్కరణ, పళనిస్వామి ఎంపిక

బి‌జే‌పి ఎత్తుకు శశికళ పై ఎత్తు వేశారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పై బహిష్కరణ వేటు వేశారు. ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా అప్పటి జయలలిత విధేయుడు, ఇప్పటి తన విధేయుడు అయిన పళని స్వామిని ఎంపిక చేసింది. ఫలితంగా పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి అవకాశాలు రాజ్యాంగ పరంగానే మూసుకుపోయాయి. శశికళ అనుచరునికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు మెరుగు పడ్డాయి. పళనిస్వామి అప్పుడే గవర్నర్ ని కలిశారు. తనకు 127 మంది…

శశికళ దోషిగా నిర్ధారణ, మోడీ రాజకీయానికి గెలుపు

శశికళ నటరాజన్ కలలు కల్లలయ్యాయి. కళ్ళ ముందు ఊరిస్తూ కనిపించిన ముఖ్య మంత్రి పీఠం ఆమెకు దూరం అయిపొయింది. నోటి కాడ ముద్ద చెల్లా చెదురయింది. ముఖ్య మంత్రి కార్యాలయానికి బదులు ఆమె జైలుకు వెళ్లాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక హై కోర్టు తీర్పును పక్కనబెట్టి ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. తమిళనాడులో అయితే సాక్షులను జయలలిత ప్రభావితం చేస్తుందన్న పిటిషనర్ల విన్నపం దరిమిలా జయలలిత, శశికళ నటరాజన్, ఇళవరసి, సుధాకరన్…

‘అమ్మ’ కుర్చీలో పన్నీర్ సెల్వం! -కార్టూన్

హస్తిమశకాంతరం అంటే ఇదే కావచ్చు. ముఖ్యమంత్రిగా జయలలిత కూర్చున్న కుర్చీని ఇప్పుడు పన్నీర్ సెల్వం (OPS) అధిరోహించారు. ఆమె సింహాసనంపైన ఈయన ఎలకలా కనిపిస్తున్నారు. ఈ అంతరం శరీర పరిమాణంలో నిజమే, స్టేచర్ లోనూ నిజమే!

తమిళనాడా, జయలలితా? -కార్టూన్

తమిళనాడు ప్రజల పురచ్చి తలైవి జైలు పాలు కావడంతో ఆమె నియమించిన మంత్రివర్గం రాజీనామా చేసింది. జయలలితకు నమ్మినబంటుగా పేరు పడి సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకసారి అధిష్టించి జయలలిత విడుదల కాగానే తిరిగి ఆమె పీఠాన్ని ఆమెకు అప్పగించిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గమూ కొలువుతీరింది. పేరుకు కొత్త మంత్రివర్గమే గానీ పాత మంత్రివర్గాన్నే పన్నీర్ సెల్వం కొనసాగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు,…