పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4

(3వ భాగం తరువాత………..) అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది. అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట…

అక్రమ డబ్బు, పన్ను ఎగవేతలకు నూతన స్వర్గం అమెరికా! -3

– (2వ భాగం తరువాత………….) అక్రమ డబ్బుకు కొత్త స్వర్గం అమెరికా! 2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాతి రోజుల్లో అమెరికా, ఐరోపాలు జి20 ని ప్రధానంగా రంగంలోకి దించాయి. జి20 పేరుతో సంక్షోభం భారాన్ని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలపై నెట్టడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లక్ష్యంగా పెట్టుకుంది. (ఐతే చైనా ఆ బుట్టలో పడకపోవడం వేరే సంగతి).…

పనామా పేపర్స్: పుతిన్ ఎందుకు కేంద్రం అయ్యాడు? -2

(మొదటి భాగం తరువాత……….) అసలు ఐ‌సి‌ఐ‌జే ఎక్కడిది? సంవత్సరం క్రితం వరకూ దీనిని గురించి తలచుకున్నవారు లేరు. 1997లో స్థాపించినట్లు చెబుతున్న దీని మాతృ సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెగ్రిటీ (సి‌పి‌ఐ). సి‌పి‌ఐకి నిధులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మొత్తం విషయంలో సగం అర్ధం అయిపోతుంది. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) మాజీ రాయబారి క్రెయిగ్ ముర్రే తన వెబ్ సైట్ లో ఇలా తెలిపాడు. “మొస్సాక్ ఫన్సెకా సమాచారాన్ని వడ కట్టిన…

ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…