అరుణాచల్: మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య

గత ఏడెనిమిది నెలలుగా కాంగ్రెస్, బిజెపిల పదవీ రాజకీయాలకు కేంద్రంగా వార్తల్లో నిలిచిన అరుణాచల్ ప్రదేశ్, అనూహ్య సంఘటనను చవి చూసింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తిరుగుబాటుకు నేతృత్వం వహించి, అనంతరం బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్, ముఖ్యమంత్రి నివాసంలో శవమై కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తెలియజేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్ ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఆయన  తాడుతో మెడకు ఉరి వేసుకుని…

ములాయంజీ! ఆకాశానికి నిచ్చెన నిలిచేనా? -కార్టూన్

బిజెపి అగ్రనాయకుడు గత సంవత్సరం ఒక అనూహ్యమైన వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులే ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ప్రధాన మంత్రి పదవి కోసం కలలు కంటున్నారని భావిస్తున్న అద్వానీ, ఉన్నట్టుండి ఇలా అన్నారేవిటా అని పరిశీలకులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. బహుశా బిజెపి లోనే ప్రధాని పదవికి పోటీగా వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఝలక్ ఇవ్వడానికి అద్వానీ ఒక అస్త్రాన్ని…

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతం మిలియన్ మార్చ్ విధ్వంసానికి కారణాలు

తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలియడంతోనే టాంక్ బండ్ పై ఉన్న ఆందోళనకారులు ఆయన విడుదల డిమాండ్ చేస్తూ విగ్రహాల ధ్వంసం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ తర్వాత కోదండరాంను విడుదల చేశాక “కోదండరాంను విడుదల చేశార”న్న సమాచారంతో కే.సి.ఆర్ హడావుడిగా టాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పటికీ కే.సి.ఆర్ మాటకూడా వినకుండా విగ్రహలు ధ్వంసం చేయడం వారు కొనసాగించారని “ది హిందూ” పత్రిక తెలియజేసింది. సంఘటనల క్రమం ఐదువందల మంది ఐ.ఎఫ్.టి.యు…

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు

బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు,…