మీడియా స్వేచ్ఛపై అశుభకర ప్రతిబంధకం -ద హిందు…
హిందీ టెలివిజన్ చానెల్ ఎన్‌డిటివి ఇండియా ను నవంబర్ 9 తేదీన 24 గంటల పాటు ప్రసారం కాకుండా నిలిపివేయాలని నిర్దేశిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశం మీడియా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడమే. జాతీయ భద్రత అంశానికి సంబంధించినంతవరకు భిన్నాభిప్రాయాన్ని సహించనట్లు కనిపించే ప్రభుత్వం నుండే ఈ సస్పెన్షన్ ఆదేశం వెలువడడంలో పాత్రికేయ రచనాంశాల పైన నిబంధనలు విధించే వైపుగా మొగ్గు చూపే కలత పూర్వక ధోరణి తొంగి చూస్తున్నది. పఠాన్ కోట్…