ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

సిక్సర్ సిద్దు: బ్యాట్ లేకుండా బ్యాటింగ్

పాపం నవ జ్యోత్ సింగ్ సిద్ధూ! పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని ఆశపడి ఏ‌ఏ‌పి లో జొరబడబోయారు. కానీ సి‌ఎం పదవి అప్పగించేందుకు ఏ‌ఏ‌పి ఒప్పుకోకపోవడంతో ఆవాజ్-ఏ-పంజాబ్ పేరుతో కూటమి పెడుతున్నట్లు ప్రకటించారు. కానీ తమ ఫ్రంటు ఒక ఫోరంగా మాత్రమే ఉంటుందని ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. తాను పార్టీ పెడితే అకాలీ వ్యతిరేక ఓట్లు చీలి మళ్ళీ అకాలీకే లాభిస్తుందని అందుకని పోటీ చేయడం లేదని ప్రకటించారు. ప్రకటించిన కారణం…

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…