మరో ‘వైట్’ హంతకుడికి ‘విముక్తి’ -ఫోటోలు

మరో వైట్ పోలీసు ఆధిపత్యం, మరో నల్లజాతి పౌరుడి హత్య, చివరికి మరో గ్రాండ్ జ్యూరీ గుడ్డి తీర్పు! గత జులైలో డ్రగ్స్ అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులు ఓ నల్లజాతి పౌరుడిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. అతడి గొంతు చుట్టూ చేయి బిగించి పట్టుకుని బరబరా పోలీసు వ్యాన్ దగ్గరికి ఈడ్చుకెళ్లారు. మరో ముగ్గురు, నలుగురు పోలీసులు గొంతు బిగించిన పోలీసుకు సహకరించారు. ఈడ్చుతున్నప్పుడే ఆ బాధితుడు అరుస్తూనే ఉన్నాడు, ‘నాకు ఊపిరి అందడం లేదు’ అని.…