న్యూయార్క్: పేలుళ్లలో కుప్పకూలిన భవనాలు -ఫోటోలు

35 వేల అడుగుల ఎత్తునుండి కుప్ప కూలిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ దొరకనే లేదు. ప్రపంచం అంతా ‘ఫ్లైట్ ఎం‌హెచ్370’ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగానే అమెరికాలో మరో ప్రమాదం నమోదయింది. న్యూయార్క్ నగరం లోని అప్పర్ మన్ హటన్ (ఈస్ట్ హర్లేమ్) లో పేలుడు సంభవించడంతో రెండు భవనాలు కుప్ప కూలాయి. ఈ పేలుడుకు పైపుల నుండి వంట గ్యాస్ లీక్ అవడం కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. పేలుడులో ముగ్గురు మరణించారని గురువారం…