ఇండియాలో అమెరికా రాయబారుల వీసా ఫ్రాడ్

తమ పని మనిషి విషయంలో దేవయాని వీసా ఫ్రాడ్ కి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అమెరికన్ అయినా-ఇండియన్ అయినా, ధనికులైనా-పేదలైనా, యజమాని ఐనా-పని మనిషి ఐనా ఇలాంటి నేరాలు సహించేది లేదని హుంకరించింది. అయితే దేవయాని చేసిందంటున్న నేరంలో భారత ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అనగా ఫలానా పద్ధతుల ద్వారా పని మనుషుల్ని అమెరికా తీసుకెళ్లవచ్చని భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇండియాలో ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండడానికి, తమతో పాటు…

సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మరోసారి రుజువు చేసుకుంది. సి.ఐ.ఏ గూఢచారులు  సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ వార్త ప్రచురించి 35 నిమిషాల్లోనే దాన్ని మార్చి వేసిన ఘటనను ‘న్యూస్ స్నిఫర్’ అనే వెబ్…

అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్

అమెరికా తరచుగా గొప్పలు చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్ధను ఛేదించే వైపుగా చైనా తన మిసైళ్లను అభివృద్ధి చేస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. యూరప్ దేశాలకు కూడా ఇరాన్, ఉత్తర కొరియాల మిసైళ్ళ నుండి రక్షణ కల్పించే ‘మిసైల్ డిఫెన్స్ సిస్టమ్’ (ఎం.డి.ఎస్) ఏర్పాటు పూర్తి చేశామని అమెరికా కొద్ది నెలల క్రితం ప్రకటించింది. యూరోప్ కోసం అని చెబుతూ మధ్య యూరప్ నుండి తన సరిహద్దు దేశాల వరకూ ఆయుధ వ్యవస్ధను అమెరికా నిర్మించడం…

‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2

– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…

లిబియా జోక్యం చట్టవిరుద్ధం -అమెరికా కాంగ్రెస్ సభ్యుడు

లిబియా జోక్యం చట్ట విరుద్ధమని అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు, న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. లిబియా మరో ఇరాక్ కానున్నదని జోస్యం చెప్పాడు. అమెరికా తదితర పశ్చిమ దేశాలతో సహకరిస్తే మిగిలేది నాశనమేనని అవి తమ వినాశకర జోక్యం ద్వారా నిరూపిస్తున్నాయని నిరసించాడు. ఓహియో నుండి ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ నుండి ఎన్నికయిన డెన్నిస్ జె. క్యుసినిచ్, మంగళవారం పత్రికకు రాసిన లేఖ న్యూయార్క్ టైమ్స్ పత్రిక బుధవారం ప్రచురించింది. ఆగష్టు 29…