ఒక నిస్సహాయ పరిస్ధితి -ది హిందు ఎడ్..

[ఏప్రిల్ 26, 2016 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ఎడిటోరియల్  “A Desperate situation” కు యధాతధ అనువాదం] ********* మితి మీరిన భారం, సిబ్బంది లేమిలతో కూడిన భారతీయ న్యాయ వ్యవస్ధలో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండడం అందరూ ఎరిగిన విషయం. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ భావావేశంతో చేసిన విజ్ఞాపన ఈ సమస్యకు తీవ్రతను, తక్షణమే దృష్టి పెట్టవలసిన ఆవశ్యకతను…

సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…

సల్మాన్ కొక న్యాయం, అఫ్జల్ కొక న్యాయం?! -1

భారత దేశ పార్లమెంటరీ రాజకీయార్ధిక వ్యవస్ధను కంటికి రెప్పలా కాపాడుతున్న భారతీయ కోర్టులు తాము, రాజ్యాంగ చట్టాలు చెబుతున్నట్లుగా, అందరికీ ఒకటే న్యాయం అమలు చేయడం లేదని మరోసారి రుజువు చేసుకున్నాయి. సల్మాన్ ఖాన్ హిట్ & రన్ కేసు విషయంలో అంతిమ తీర్పు ప్రకటిస్తూ ముంబై హై కోర్టు చేసిన వ్యాఖ్యలు, పొందుపరిచిన సూత్రాలకూ అఫ్జల్ గురు కేసు విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సూత్రాలకూ మధ్య తేడాను గమనిస్తే ఈ సంగతి తేలికగా…

Rape conviction rate

రేపిస్టులను వదిలేస్తున్న భారత న్యాయ, సామాజిక వ్యవస్ధలు

రేపిస్టులు భారత దేశంలో కాలరెత్తుకు తిరుగుతున్నారు. అనేక సామాజిక అడ్డంకులు ఎదుర్కొని మరీ రేప్ నేరాలను రిపోర్టు చేస్తున్న బాధితులకు దక్కుతున్నది అవమానాలూ, నిరాశే తప్ప న్యాయం కాదు. 1973 నుండి ఇప్పటి వరకూ శిక్షలు పడిన రేపిస్టుల సంఖ్యలు చూస్తే రేప్ నేరాల్లో నేరం రుజువై శిక్ష పడిన కేసులు ప్రతి దశాబ్దానికి పడిపోతూ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రేప్ నేరాలలో పోలీసులు జరుపుతున్న పరిశోధనల్లో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, తేలిక భావం చోటు చేసుకోవడం…

టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను 1 1/2 సం.లు భద్రంగా ఉంచడానికి ఐన ఖర్చు రు.11 కోట్లు

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాల్గొని దొరికిపోయిన అజ్మల్ కసబ్ భద్రత కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 10.87 కోట్ల రూపాయలని తేలింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐ.టి.బి.పి) విభాగం అజ్మల్ కసబ్ కి సెక్యూరిటీ అందిస్తున్నందుకు ఇప్పటివరకూ ఖర్చయిన రు. 10.87 కోట్లను తమకు తిరిగి చెల్లించాలని బిల్లు పంపడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కి గురైంది. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్.కె.భాటియా ఈ బిల్లును పంపాడు. మార్చి 28, 2009 నుండి సెప్టెంబరు…