అణ్వస్త్రాలు: బి.జె.పిది నో-ఫస్ట్-యూజ్ సిద్ధాంతం కాదా?

రేపు సాధారణ ఎన్నికలు ప్రారంభం అవుతాయనగా బి.జె.పి ఈ రోజు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడి ప్రచారాస్త్రాలకు, మేనిఫెస్టో రచయితల అభిప్రాయాలకు వైరుధ్యం తలెత్తడం వల్లనే మేనిఫెస్టో విడుదల ఆలస్యం అయిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ మోడి ప్రచారం చేస్తుండగా సంఘ్ పరివార్ పెట్టీ డిమాండ్లయిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, రాముడి గుడి నిర్మాణం, యూనిఫాం సివిల్ కోడ్ లాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచడంతో…