నేషనల్ హెరాల్డ్ కధా కమామీషు!

‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ…