వాషింగ్టన్ లో విచ్చలవిడి షూటింగ్, 7గురు ఆహుతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిలట్రీ తరహా డ్రస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాషింగ్టన్ డి.సిలోని నావల్ డాక్ యార్డ్ లో యధేచ్ఛగా షూటింగుకు పాల్పడ్డారని పత్రికలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించగా కాల్పులకు దిగినవారిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారని తెలుస్తోంది. కనీసం మరో ఇద్దరు షూటర్లు ఉన్నారనీ, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. వెతుకుతున్నవారిలో ఒకరు తెల్లజాతి వ్యక్తి కాగా మరొకరు నల్లజాతి వ్యక్తి అని వారు తెలిపారు. కాల్పులకు…