నేపాల్: ప్రకృతి, జీవితం -ఫోటోలు

హిమాలయ రాజ్యమైన నేపాల్ సహజంగానే ప్రకృతి సౌందర్యాలకు నిలయం. ఇటీవలి వరకు ఫ్యూడల్ రాచరికంలో మగ్గిన ఫలితంగా అక్కడ దరిద్రానికి కొదవ లేదు. ఒక పక్క రాచరికం మిగిల్చిన సంపన్న భవనాలు, మరో పక్క ఆ మూడు రోజుల కోసం స్త్రీలను బందిఖానా చేసే చౌపడి గుడిసెలు! ప్రకృతి ఒడిలో నిండా మునిగినట్లుండే నేపాల్ జనజీవనానికి ప్రతిబింబాలు ఈ కింది ఫోటోలు. నేపాల్ ని ‘ప్రపంచపు పైకప్పు’ (roof of the world) అని కూడా పిలుస్తారట!…

మోడి దౌత్య మర్యాద ఉల్లంఘించారు -నేపాల్ పత్రికలు

సార్క్ దేశాల కూటమి సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి దౌత్య మర్యాదలను ఉల్లంఘించారని నేపాల్ పత్రికలు ఆరోపించాయి. ఆయన తన పరిమితులు గుర్తెరగకుండా నేపాల్ రాజ్యాంగం ఎలా ఉండాలో సలహా ఇవ్వడం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విరుచుకుపడ్డాయి. పాత పెద్దన్న వైఖరి, జోక్యందారీ పెత్తనం సహించరానివని కాంతిపుర్, నాగరిక్ పత్రికలు విమర్శించాయి. నేపాల్ లో రాచరికాన్ని కూల్చివేసిన తర్వాత రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదు. అనేక జాతుల సంగమం…