నేపాల్ భూకంపం: ఇండియావైపు కదిలిన ఎవరెస్ట్

ఏప్రిల్ 25, 2015 తేదీన నేపాల్ ప్రజల్ని కొద్ది సెకన్ల కాలంలోనే భారీ వినాశనంలోకి నెట్టివేసిన భూకంపం అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ప్రభావితం చేయకుండా వదల్లేదు. భూకంప లేఖిని (రిక్టర్ స్కేల్) పై 7.9 పరిమాణాన్ని నమోదు చేసిన నేపాల్ భూకంపం వల్ల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశగా, అనగా ఇండియా వైపుకి 3 సెంటీ మీటర్ల మేరకు కదిలిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడి చేశారు. నేపాల్ భూకంపం వల్ల…

(నేపాల్) విపత్తు సమయంలో మైకులు -ది హిందు ఎడిట్..

(Mikes in the time of disaster శీర్షికన ఈ రోజు -మే 8- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) ********** “If it bleeds, it leads” (వివరణకు ఆర్టికల్ చివర చూడండి.) అని న్యూస్ రూమ్ లో ఒక వాడుక. దురదృష్టవశాత్తూ, ఇది మీడియా సంస్ధలకు ఉండవలసిన మర్యాద, సభ్యత, నైతికతల నుండి వడకట్టబడి కూడా బైటకువస్తున్న సంగతిని భారతీయ ప్రసార జర్నలిజం దాదాపు క్రమం తప్పకుండా విస్మరిస్తోంది.…

నేపాల్: యూరోపియన్లు కనపడుటలేదు

నేపాల్ భూకంపం ఒక్క నేపాల్ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా అనేకమందికి విషాధాన్ని మిగిల్చింది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన 1000 మంది వరకు కనిపించకుండా పోయారని యూరోపియన్ యూనియన్ అధికారులు తెలిపారు. పర్వతారోహకులకు హిమాలయ పర్వతాలు ఆకర్షణీయం కావడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. 1000 మంది వరకూ ఆచూకీ తెలియకుండా పోగా 12 మంది మరణించినట్లు ధృవపడిందని నేపాల్ సందర్శించిన ఈ.యు బృందం తెలిపింది. “వాళ్ళు ఎక్కడ ఉన్నదీ తెలియదు. కనీసం ఎక్కడ…

నేపాల్ భూకంపం: మృతులు 2200 పైనే -ఫోటోలు

నేపాల్ ను తాకిన భారీ భూకంపం ఆ చిన్న దేశంలో విలయాన్ని సృష్టించింది. ఇటీవలి వరకూ కొనసాగిన శతాబ్దాల నాటి భూస్వామ్య రాచరిక పాలన దేశ సంపదలను కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకరింపజేయడంతో ఇప్పుడది ప్రకృతి విలయానంతర రక్షణ ఏర్పాట్లు చేయడంలో కూడా ఘోరంగా విఫలం అవుతోంది. సంపన్న కుటుంబాలు ప్రభుత్వాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టడంతో రక్షణ పరికరాలు కొరవడి, తగిన శిక్షణ లేని భద్రతా సిబ్బంది తెల్లమొఖం వేయడంతో జనమే పూనుకుని తమ ఏర్పాట్లు తాము…