ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు జెస్సి జాక్సన్ ఇండియా సందర్శించారు. జెస్సీ జాక్సన్ అమెరికాలో 1960ల కాలంలో వెల్లివిరిసిన నల్ల జాతి పౌర హక్కుల ఉద్యమానికి నేతృత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ సమకాలికులు. భారత జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ‘నేతాజీ మ్యూజియం’ ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోల్ కతా లో ఆయన సుభాష్ సోదరుని కుమార్తె కృష్ణ బోస్ కలిసి జెస్సీ…

మండేలా అంతిమ క్రియల్లో ఒబామా ఫోటో సంబరం

ఒక వ్యక్తి చనిపోయినపుడు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారికి జరిగిన నష్టం వలన తాము ఎంత భాధగా ఉన్నది తెలిసేట్లుగా ప్రవర్తిస్తారు. వేరే ఎన్ని పనులున్నా వాటి జోలికి పోకుండా సంయమనం పాటిస్తారు. నెల్సన్ మండేలా లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాట యోధుడు చనిపోయినప్పుడయితే ఎంత క్రమశిక్షణ పాటించాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అమెరికా, డెన్మార్క్, బ్రిటన్ దేశాల అధినేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తలకెక్కారు.…

మండేలా: చరితలో చిరకాలం నీ పేరు నిలుచుననీ… -ఫోటోలు

పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ఐనా మనిషి దుఃఖించక మానడు. చావు, పుట్టుకలకు అతీతంగా జీవితాన్ని సార్ధకం చేసుకునేవారు చరిత్రలో అనేకులు ఉన్నారు. వారిలో మానవజాతి తలచుకునేది కొందరినే. ఎవరైతే జాతి పురోగతికి మార్గ నిర్దేశకులుగా నిలుస్తారో, ఎవరైతే జాతి మొత్తాన్ని ఏక తాటిపై నడిపిస్తారో వారిని మానవ జాతి చరిత్ర జాతి నేతలుగా రికార్డు చేస్తుంది. అలాంటి గొప్ప నాయకుల్లో నెల్సన్ మండేలా ముందు పీఠిన నిలుస్తారు. జులై 18, 1918 తేదీన ఒక…

తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట!

1990 దశాబ్దం అంతా ఈ పాట తెలుగు నేలపై మోగుతూ ఉండేది. ముఖ్యంగా పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘంతో పాటు ఇతర విప్లవ విద్యార్ధి సంఘాల్లో పని చేసిన, అనుసరించిన విద్యార్ధులకు ఈ పాట చిరపరిచితం. నల్లజాతి ప్రజల సాయుధ తిరుగుబాటుకు తలఒగ్గుతూ దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం 1990లో నెల్సన్ మండేలాను విడుదల చేసినపుడు అప్పటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు శక్తి ఉరఫ్ జె.కనకరాజు గారు ఈ పాట రాసి పాడారు. తెలంగాణ ప్రజా కళాకారులు జయరాజ్…

ఆరిపోయిన నల్ల వజ్రానికి ప్రపంచం నివాళి -ఫోటోలు

27 సంవత్సరాల కారాగారవాసం సైతం రొలిహ్లాహ్లా మండేలాను కుంగదీయలేదని చెప్పడానికి  95 యేళ్ళ ఆయన నిండు జీవితానికి మించిన సాక్ష్యం ఏముంటుంది? బలమైన శత్రువుకు వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రారంభంలో గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఎత్తుగడల రీత్యా ఆశ్రయించిన మండేలా జాత్యంకార అణచివేతను నిర్ణయాత్మకంగా ఓడించాలంటే సాయుధ పోరాటం తప్ప దారి లేదని సరిగ్గానే అంచనా వేశారు. ఏ.ఎన్.సి యువజన సంస్ధ సాయుధమై మిలిటెంట్ గెరిల్లా పోరాటమే చేయకపోతే మండేలా విడుదల సాధ్యం అయ్యేదే కాదని చరిత్ర…

ముగిసిన మండేలా లాంగ్ వాక్ -2

మొదటి భాగం తరువాత………………. అయితే మండేలా ఖైదుతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం బలహీనపడకపోగా మరింత బలపడింది. 1980ల కల్లా జాత్యహంకార రాజ్యం ఆస్తులను ధ్వంసం చేసే చర్యలు ఊపందుకున్నాయి. గెరిల్లా దాడులు పెరిగిపోయాయి. మండేలా ఖైదు దక్షిణాఫ్రికా అంతటా సంవత్సరాల తరబడి స్ధిరమైన చైతన్యానికి పాదుకొల్పింది. ఉమ్మడి నాయకత్వానికి మండేలా ప్రాధాన్యం 1986లో వెలువడిన ‘మండేలా కోసం ఎదురుచూపులు’ అన్న పుస్తకంలో రచయిత జె.ఎం.కొయెట్జి ఇలా పేర్కొన్నారు. “1985 నాటి తిరుగుబాట్లలో ఎక్కడ చూసినా ఆయన…

లాంగ్ వాక్ చాలించిన నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా -1

నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా ‘సుదీర్ఘ నడక’ (లాంగ్ వాక్) గురువారం సాయంత్రంతో (స్ధానిక సమయం) ముగిసింది. 95 సంవత్సరాల ముదిమి మీద పడిన నల్ల సూర్యుడు నల్లజాతి విముక్తిని అర్ధాంతరంగా వదిలి శాశ్వత అస్తమయాన్ని ఆవాహన చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా పదే పదే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మండేలా ఇక ఊపిరి పీల్చడం తనవల్ల కాదంటూ సెలవు తీసుకున్నాడు. శ్వేత జాత్యహంకార అణచివేతను ధిక్కరించిన నల్ల వజ్రం తన జీవితకాల పోరాట వెలుగులను తన జాతిజనుల చరిత్రకు…