విదేశీ మందులోడికి మోడీ షాక్?!

“నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే ఒరే” అని విదేశీ మందులోడు పాడుకుంటాడేమో ఇక! లేకపోతే నమ్మి, బ్రాండ్ ఇమేజి పెంచి, అధికారంలోకి రావడానికి సహకరిస్తే మరిన్ని మందులని ‘నియంత్రిత ధరల’ జాబితాలోకి మోడి ప్రభుత్వం తేవడాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలు ఎలా అర్ధం చేసుకోగలవు? భారత దేశంలో అమ్ముడయ్యే ఔషధాలలో మరిన్ని ‘ధరల నియంత్రిత జాబితా’ (price control) లోకి చేర్చాలని నరేంద్ర మోడి ప్రభుత్వం యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు కొన్ని పత్రికలకు ఉప్పందించాయి.…

కంపల్సరీ లైసెన్స్ ఫలితం, 2.8 లక్షల కేన్సర్ ఔషధం ఇప్పుడు 9 వేలే

ప్రపంచ మార్కెట్ లో 2.8 లక్షల రూపాయల ఖరీదు చేసే ఔషధాన్ని కేవలం 9 వేల రూపాయలకే భారత దేశ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లో భాగమైన ట్రిప్స్ (Trade Related Intellectual Property Rights) ఒప్పందం ప్రకారం ఒక కంపెనీ పేటెంటు పొందిన ఔషధాన్ని మరొక కంపెనీ తయారు చేయరాదు. ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ఖరీదుకు మందులు తయారు చేయగలిగినా ట్రిప్స్ ఒప్పందం దానిని నిషేధిస్తుంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి…