మహిళలపై నేరాలు -గ్రాఫిక్స్

2012, 2013 సంవత్సరాలకు గాను జనవరి 1 నుండి ఏప్రిల్ 15 వరకు భారత దేశంలో మహిళలపై జరిగిన వివిధ నేరాలను పోల్చుతూ పి.టి.ఐ వార్తా సంస్ధ ఈ క్రింది గ్రాఫిక్స్ ను తయారు చేసింది. ది హిందు పత్రిక అందజేసిన ఈ గ్రాఫిక్స్ లో వివరాలు కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడినవారిలో అత్యధికులు సమీప బంధువులు, తెలిసినవారేనని ఈ వివరాల ద్వారా తెలుస్తున్నది. 2013లో ఇప్పటి వరకు 1869 నేరాలు మహిళలపై…

చైనా, రష్యాల్లో సోషలిజం – నెహ్రూ సోషలిజం – నిజా నిజాలు

రష్యాలో 1917 లో బోల్షివిక్ పార్టీ అధ్వర్యంలో ప్రజలు సోషలిస్టు విప్లవం తెచ్చుకున్ననాటినుండి 1954 లో స్టాలిన్ చనిపోయేంత వరకూ సోషలిస్టు సమాజ నిర్మాణం జరిగింది. ఆయన చనిపోయాక కృశ్చేవ్ నుండి గోర్బచెవ్ వరకూ జరిగింది సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు. వారు సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం వదిలేసి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి ప్రయాణం కట్టారు. అమెరికాతో ప్రపంచ ఆధిపత్యంకోసం పోటీపడి తూర్పు యూరప్, ఆఫ్ఘనిస్ధాన్ తదితర దేశాల్ని అమెరికా లాగానే మార్కెట్ల కోసం తమ ప్రభావంలో ఉంచుకున్నారు.…