కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?

భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా…

పోస్కో (POSCO) కంపెనీ కోసం ప్రభుత్వాల పచ్చి అబద్ధాలు, అరాచకాలు

పోస్కో కంపెనీ ప్రాజెక్టు: ఇది దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి కంపెనీ. భారత దేశంలో సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తానని 2005 లో భారత దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్ డాలర్ల (రు. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీకి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌సింగ్ పూర్…

పోస్కో వ్యతిరేక ఆందోళన తీవ్రతరం, పిల్లలు మహిళలతో మూడంచెల ప్రతిఘటన వ్యూహం

ఒడిషాలొని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాలను బహుళజాతి ఉక్కు కంపెనీ కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నాలను తీవ్ర్రం చేసింది. దాదాపు 3000 ఎకరాల్లోని అటవీ భూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైనే అక్కడ ఉన్న…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…