రైతులు ఓ.కె అంటే మంగళగిరి, లేదంటే నూజివీడు

రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మైండ్ గేమ్ ఆడబోతున్నట్లు కనిపిస్తోంది. రైతులకు, ఇతర వర్గాలకు మధ్య అనవసర విభేదాలు రేపే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం తీసుకుందని ఛానెళ్ల వార్తలను బట్టి తెలుస్తోంది. మంత్రివర్గ నిర్ణయాలను ఎవరికీ చెప్పొద్దని ముఖ్యమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని చెబుతూనే రాజధానిపై వారేమి చర్చించారో వెల్లడి చేశాయి. రైతులు అంగీకరిస్తే మంగళగిరి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఒకవేళ మంగళగిరి రైతులు మొరాయిస్తే గనుక నూజివీడు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని…