అగ్రకుల పిల్లల పేరే పెట్టుకున్నాడని దళిత బాలుడిని చంపేశారు

భారత దేశంలో కుల దురహంకారం ఇంకా ఏ స్ధాయిలో కొనసాగుతున్నదో ఈ ఘటన పచ్చిగా చెబుతోంది. కుల పిచ్చికి ఉన్న రూపాలు ఇంకా పూర్తిగా ప్రచారం లోకి రాలేదేమోనని ఇటువంటి సంఘటనలు జరిగినపుడే తెలుస్తోంది. అగ్రకులస్ధుడికి ఉన్న ఇద్దరు పిల్లలకు ఏ పేర్లయితే ఉన్నాయో దళిత కులస్ధుడు కూడా పెట్టుకున్నాడు. పేర్లు మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా మార్చకపొవడంతో దళిత కులస్ధుడి పిల్లల్లో ఒకరిని చంపేశారు. (బి.బి.సి వార్త కోసం ఇక్కడ చూడండి). ఉత్తర ప్రదేశ్ లో ఈ…