గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…

గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

లిబియా దాడులపై అమెరికా, ఫ్రాన్సులకు దొరకని మద్దతు

లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…

లిబియా పౌరుల రక్షణకై చేసే దాడుల్లో పౌరులే చనిపోతున్నారు -అరబ్ లీగ్

అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అమీర్ మౌసా లిబియాపై పశ్చిమ దేశాల దాడులు తీవ్ర స్ధాయిలో ఉండడాన్ని ఆదివారం విమర్శించాడు. లిబియా పౌరులను గడ్డాఫీ విమానాల దాడులనుండి రక్షించడకోసం భద్రతా సమితి అనుమతి ఇచ్చింది తప్ప వారిని చంపడానికి కాదన్నాడు. లిబియాలో జరుగుతున్నది లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ఉన్నదని విమర్శించాడు. పౌరుల రక్షణనే మేం కోరాం తప్ప మరింతమంది పౌరులపై దాడులు చేయడం కాదన్నాడు. ఆదివారం పశ్చిమ దేశాలను విమర్శించిన అమిర్…

పైచేయి సాధించిన గడ్డాఫీ, ‘నో-ఫ్లై జోన్’ అమలుకు భద్రతా సమితి ఓటింగ్

లిబియా తిరుగుబాటుదారుల పై గడ్డాఫీ పైచేయి కొనసాగుతోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకోదగిన ‘అజ్దాబియా’ పట్టణం కోసం ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. పట్టణాన్ని గడ్డాఫీ బలగాలు మూడువైపుల నుండి చుట్టుముట్టాయి. తూర్పు లిబియాలో అతి పెద్ద పట్టణం, లిబియాలో ట్రిపోలి తర్వాత అతి పెద్ద పట్టణం అయిన బెంఘాజీకి అజ్దాబియా 160 కి.మీ దూరంలో ఉంది. రెడ్ క్రాస్ సంస్ధ సిబ్బంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం బెంఘాజీ నుండి…

లిబియా తిరుగుబాటు ప్రతినిధితో హిల్లరీ సమావేశం, నో-ఫ్లై జోన్ ఆమోదం?

నాటో కూటమి లిబియా గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ లో జి-8 గ్రూపు దేశాల మంత్రుల సమావేశం జరిగింది. లిబియా భూభాగంపై ఉన్న గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే విషయాన్ని చర్చించడం కోసం జి-8 దేశాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వ ప్రతినిధి “మహమ్మద్ జెబ్రిల్” హిల్లరీ క్లింటన్ ను కలిశాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం వివరాలు ఏవీ తెలియలేదు. జి-8…

లిబియా నిషిద్ధ గగనతలానికి అరబ్ లీగ్ ఆమోదం, గడ్డాఫీ బలగాల పురోగమనం

లిబియా అంతర్యుద్ధంలో గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను తూర్పువైపుకి నెట్టుకుంటూ వెళ్తున్న నేపధ్యంలో కైరోలో శనివారం సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” అమలుకు ఆమోదముద్ర వేశాయి. సిరియా, అల్జీరియా మినహా అన్ని దేశాలూ “నో-ఫ్లై జోన్” ప్రతిపాదనను ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిని లిబియాపైన “నో-ఫ్లై జోన్” అమలు చేయాల్సిందిగా కోరుతూ అరబ్ లీగ్ తీర్మానించింది. లిబియాలో ప్రస్తుత సంక్షోభం ముగిసే వరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తీర్మానంలో…

గడ్డాఫీ బలగాల పురోగమనం, విదేశీసాయం కోసం తిరుగుబాటుదారుల ఎదురుచూపు

గడ్డాఫీ బలగాలు ప్రతిదాడులను తీవ్రం చేస్తూ మెల్లగా పురోగమిస్తున్నాయి. రాస్ లానుఫ్ ఆయిల్ పట్టణాని స్వాధీనం చేసుకునే వైపుగా కదులుతున్నాయి. మరో ఆయిల్ పట్టణం బ్రెగా సరిహద్దుల్లో బాంబుదాడులు చేశాయి. రాస్ లానుఫ్ లో పోరు తీవ్రంగా జరుగుతోంది. వాయు, సముద్ర మార్గాల్లొ గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ లోని తిరుగుబాటుదారులపై దాదులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాల దాడులను తిరుగుబాటు బలగాలు ఎదుర్కొనలేక పోతున్నాయి. పశ్చిమ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” ప్రకటించి అమలు…

గడ్డాఫీ రాజీ ప్రతిపాదన తిరస్కరణ, పోరాటం తీవ్రం

లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ…

పిలవని పేరంటానికి అమెరికా, లిబియా వద్ద యుద్ధ వాతావరణం

  అమెరికాకి ఈ జన్మలో బుద్ధిరాదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలొ చావుతప్పి కన్ను లొట్టబోయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి బయలుదేరింది. లిబియా ప్రాంతంలో తమ యుద్ధ పరికరాలు, సైనికులను లిబియాపై చర్యకు అనుకూలంగా ఉండేలా మొహరిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిర్ణయాలు తీసుకున్న వెంటనే చర్య ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నాటో తదితర మిత్రులతో చర్చలు జరుపుతున్నామనీ, గడ్డాఫీ సైన్యానికి చెందిన విమానాలు తిరగకుండా ఉండటానికి లిబియా గగన తలాన్ని…