ఫ్రాన్స్ లో పెరుగుతూన్న అలజడి -ది హిందు ఎడిట్ (విమర్శ)

[శనివారం, జూన్ 11 తేదీన “Growing unrest in France” శీర్షికన ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. అనువాదం అనంతరం సంపాదకీయంపై విమర్శను చూడవచ్చు. -విశేఖర్] ——— సమ్మెలకు ఫ్రాన్స్ కొత్త కాదు. కానీ సోషలిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షంవైపు మొగ్గు చూపే కార్మిక యూనియన్లు వారాల తరబడి సాగిస్తున్న అలజడి మున్నెన్నడూ ఎరగనిది. మే 17 తేదీన సమ్మె ప్రారంభించిన యూనియన్లు ఫ్రాన్స్ లోని కఠిన కార్మిక చట్టాలను…

నిరుద్యోగంలో వివిధ రకాలు -ఈనాడు

భారత దేశ జనాభా 120 కోట్ల పై మాటే. వారిలో నిరుద్యోగులు ఎంతమంది అని అడిగితే ప్రభుత్వాలు చెప్పే సమాధానం 4 కోట్లు అని. 120 కోట్ల మంది జనాభాలో నిరుద్యోగులు 4 కోట్ల మందేనా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఈ సంఖ్య కేవలం చదువుకున్న వారికి మాత్రమే సంబంధించింది అని మనకు వెంటనే కనపడదు. చదువుకున్న వారిలో కూడా ఎవరైతే ఉద్యోగం కావాలని ఎంప్లాయ్ మెంట్ ఎక్ఛెంజీలో రిజిస్టర్ చేసుకున్నారో వారిని మాత్రమే…

సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాలను చుట్టుముట్టిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఇంకా ఆ దేశాల్ని పీడిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) ప్రకటించిన తాజా ఉద్దీపన చర్యలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సున్న శాతానికి దగ్గరగా ఉన్న వడ్డీ రేటును మరింతగా తగ్గించడం ద్వారా మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించడానికి ఇ.సి.బి నిర్ణయం తీసుకుంది. బహుశా మరే దేశమూ ఇంతవరకు చరిత్రలో ఎరగని చర్యలను కూడా…

అమెరికా ఆహార సబ్సిడీ: పెద్దలే కాదు యువతకీ కావాలి

భారత దేశంలో ఆహార సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారని అమెరికా ఒకటే ఇబ్బంది పడుతుంది. ఆహార సబ్సిడీ పధకాన్ని ‘ఫ్రీ మీల్స్’ అని అమెరికా, ఐరోపా తదితర పశ్చిమ రాజ్యాల మేధావులు ఎకసక్కెం చేస్తారు. తద్వారా తమ దేశంలో అందరూ పని చేస్తేనే భోజనం చేస్తారన్న సందేశం ఇస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే అమెరికా, ఐరోపా దేశాల్లో ఇండియా కంటే అనేక రెట్లు ఎక్కువ సబ్సిడీ తమ కంపెనీలకు, జనానికి ఇస్తారు. అమెరికాలో ప్రాధమిక విద్య, ఉన్నత పాఠశాల…

రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం

ఐరోపాలో జర్మనీ తర్వాత హెవీ వెయిట్ గా పేరు పొందిన ఫ్రాన్స్ లో కూడా ప్రజలు నిరుద్యోగ భూతాన్ని ఎదుర్కొంటున్నారు. గత 15 సంవత్సరాలలోనే అత్యధిక స్ధాయికి అక్కడి నిరుద్యోగం చేరుకుంది. 2013 మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) ముగిసేనాటికి ఫ్రాన్స్ లో 10.8 శాతం నిరుద్యోగం నమోదయిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్ధ INSEE గురువారం తెలిపింది. 1998 తర్వాత ఈ స్ధాయి నిరుద్యోగం నమోదు కావడం ఫ్రాన్స్ లో ఇదే మొదటిసారి.…

రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ…

Austerity and unemployment

పన్నులు కోతలు వెరసి నిరుద్యోగం -కార్టూన్

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మిగిల్చిన భారాన్ని కోశాగార క్రమశిక్షణతో (fiscal discipline) పూడ్చుకోవాలని ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల్లోని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు బోధిస్తారు. అయితే క్రమ శిక్షణ ను వాల్ స్ట్రీట్ కంపెనీలు, ప్రవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి ‘టూ బిగ్ టు ఫెయిల్’ ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వర్తించవు. ఈ దగుల్బాజీ ఆర్ధికవేత్తల దృష్టిలో క్రమ శిక్షణ పాటించవలసింది ప్రజలే. ప్రజలపై వీరు రుద్దే క్రమ…

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల పొదుపు విధానాల అమలు ప్రభావం బ్రిటిష్ పౌరుల కుటుంబ బడ్జెట్‌లను బాగా కుచించివేసిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్’ చేసిన అధ్యయనంలో…

స్పెయిన్‌లో ఉద్యొగాల పరిస్ధితి -కార్టూన్

యూరప్ అప్పు సంక్షోభం యూరప్ దేశాలకు శాపంగా మారింది. ఖచ్చితంగా చెప్పాలంటే యూరప్ అప్పు సంక్షోభం యూరప్ ప్రజలకు శాపంగా మారింది. అప్పు కొండలా పేరుకు పోయి మార్కెట్ నుండి ట్రెజరీ బాండుల ద్వారా తేలికగా అప్పు సేకరించలేని పరిస్ధితిని అప్పు సంక్షోభంగా పిలుస్తున్నారు. ఇప్పటివరకూ గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల ప్రజలు దీని బారిన పడి నిరుద్యోగం, ఉద్యోగాల కోత, పెన్షన్ల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు లాంటి అనేక సమస్యలతో అల్లాడుతున్నారు. స్పెయిన్ కార్టూనిస్టు…

అమెరికా నిరుద్యోగం – బలహీన ఆర్ధిక వ్యవస్ధ – కొన్ని ముఖ్యాంశాలు

అమెరికా నిరుద్యోగం అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా మారింది. నిరుద్యోగం తగ్గడానికి నేరుగా చర్యలు తీసుకునే బదులు పెట్టుబడిదారులకు ప్రోత్సహాకాలు ఇవ్వడం ద్వారా నిరుద్యోగం తగ్గించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకున్న ప్రవేటు బహుళజాతి సంస్ధలు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించే బదులు ద్రవ్య మార్కెట్లలో స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తున్నారు. దానితో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాక ప్రజల కోనుగోలు శక్తి పెరగక ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక ఆర్ధిక వ్యవస్ధ…

బలహీనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, రానున్న వారాల్లో షేర్లు మరింత పతనం

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్లను…

లిబియా పోలీసు కాల్పుల్లో వందల మంది మృతి, చెదరని గడ్డాఫీ ఆధిపత్యం

లిబియాలో సైనికులు ఆందోళన చేస్తున్న ప్రజలపై నేరుగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించడమో, గాయపడటమో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది మరణించినదీ ఖచ్చితమయిన సంఖ్య తెలియటం లేదు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని దాదాపుగా అడ్డుకోవటం, మీడియా పై అనేక ఆంక్షలు అమలులో ఉండటంతో ఆందోళనలు, కాల్పులకు సంబంధించిన వివరాలను ధృవపరిచేవారు లేరు. రెండు వందల మందికి పైగా చనిపోయారని ఆసుపత్రి డాక్టర్లను ఉటంకిస్తూ బిబిసి తెలియజేయగా, అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధను ఉటంకిస్తూ రాయిటర్స్…