సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది. రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది. గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్…

ఈ యేటి నిరర్ధక ఆస్తులు లక్ష కోట్లు!

“ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ఇండియా మాత్రం అద్భుతమైన ప్రగతి (ఆర్ధిక వృద్ధి) నమోదు చేస్తుంది. ఇది మా విధానాల వల్లనే సాధ్యపడింది….” ఇది ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి మోడి తరచుగా చెబుతున్న మాట! ప్రధాని మాటలు వాస్తవమేనా? కాదు అని ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాచారం చెబుతోంది. రాజ్య సభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు -మొదటి…

బ్యాంకుల నికర నిరర్ధక ఆస్తులు 1.3 లక్షల కోట్లు!

ప్రభుత్వ పధకాల కింద కూడా సామాన్యులకు అప్పులు నిరాకరించే బ్యాంకులు కోటీశ్వరులకు మాత్రం పిలిచి అప్పులిస్తాయి. ఆ అప్పులు వసూలు కాక తామే ఋణ గ్రహీతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. చివరికి ప్రభుత్వాలు ప్రకటించే స్కీముల క్రింద తీరని అప్పులను నిరర్ధక ఆస్తుల (Non-Performing Assets -NPAs) కింద నెట్టేస్తాయి. ఇలా వసూలు కానీ బాకీల విలువ 2013-14 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి అర్ధ భాగంలో 38 శాతం పెరిగి 1,28,533 కోట్లకు చేరిందని ఎన్.పి.ఏ సోర్స్…