ఫ్రాన్సు అతి తెలివి – ట్యునీషియా మచ్చ లిబియాకు సహాయంతో మటుమాయం?
కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రస్తుతం గడ్డాఫీ వ్యతిరేకుల ప్రభావంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి సహాయం చేసే పనిలో ఫ్రాన్స్ ఉంది. డాక్టర్లు, నర్సులు, మందులతో రెండు విమానాలు లిబియాలో తిరుగుబాటు దారులకు కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణానికి బయలుదేరినట్లు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ ఫిల్లాన్ ప్రకటించాడు. ట్యునీషియాలో ప్రజల తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు జైన్ ఎల్-అబిదైన్ బెన్ ఆలీ పదవీచ్యుతుడయిన విషయం తెలిసిందే. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగుతున్న…