బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్

తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర…